విశాలాంధ్ర -ధర్మవరం : స్వల్పకాలపు ఆనందానికి బానిసగా మారి దీర్ఘకాల భవిష్యత్తును నేటి యువత నాశనం చేసుకుంటున్నది అని సెబ్ ఇన్చార్జి ఎస్సై శివ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో “యువత – భవిత” కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా వరకు డ్రగ్స్ నేరాలు విద్యార్థి దశలోనే నమోదవుతూ, అది వారి ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకాలుగా మారుతున్నాయని తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవిస్తూ, తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన సందర్భాలు అనేకం ఉన్నాయని, ఈ వయస్సులో ప్రతీ ఒక్కరూ వీటిపై అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం అని తెలిపారు. కనుక ఇప్పటినుండి అయినా విద్యార్థినీ విద్యార్థులు వీటిపై అవగాహన కలిగి, మీ చుట్టుపక్కల కూడా ఏదైనా మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఎవరైనా కనబడినా 100 కి ఫోన్ చేసి తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్ బాబు,వైస్ ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్, అధ్యాపక బృందం, సెబ్ కానిస్టేబుల్స్, విద్యార్థులు పాల్గొన్నారు.