Friday, November 1, 2024
Friday, November 1, 2024

కరాటేను నిత్య సాధనగా అలవర్చుకోవాలి.. హెడ్మాస్టర్ రాంప్రసాద్

విశాలాంధ్ర- ధర్మవరం:: కరాటే ను ప్రతి ఒక్కరూ నిత్య సాధనంగా అలవర్చుకోవాలని హెడ్మాస్టర్ రాంప్రసాద్ బీ రేస్వామి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో కరాటే విద్యలో భాగంగా బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంతవరకు కరాటే శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ ను నిర్వహించారు. ఈ బెల్ట్ గ్రేడింగ్ లో సాధించిన విద్యార్థులలో ఎల్లో బెల్ట్ లో 4, ఆరెంజ్ బెల్ట్ లో 2, గ్రీన్ బెల్ట్ లో 5 మంది, బ్లూ బెల్ట్ లో 01, బ్రౌన్ బెల్ట్స్ లో 02, బ్లాక్ బెల్ట్ లో 5మంది సాధించడం జరిగింది. వీరందరికీ ముఖ్య అతిధుల చేతుల మీదుగా బెల్ట్లును పంపిణీ చేయడం జరిగింది. అనంతరం హెచ్ఎం రాంప్రసాద్ మాట్లాడుతూ కరాటే మాస్టర్ గట్టు నాగరాజు మాట్లాడుతూ నేటి కాలంలో కరాటే విద్య ఎంతో అవసరమని, ఆ విద్యను నేర్చుకున్న తర్వాత పదిమందికి కూడా నేర్పించాలని తెలిపారు. కరాటే విద్య చక్కటి ఆరోగ్యంతో పాటు, మన ప్రాణ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా ప్రాథమిక స్థాయి నుంచే తమ కుటుంబములోని పిల్లలను కరాటే విద్యను నేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, నాగరాజు, రంగనాయకులు, బి.వి.ఆర్ చలపతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img