ఆర్థిక సహాయం అందించిన మున్సిపల్ సిబ్బంది
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మున్సిపల్ కాంట్రాక్టర్ ఉద్యోగి అయిన బొగ్గు వెంకట రాముడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని జోగోని కుంట సిద్దయ్యగుట్ట ప్రాంతంలో కాంట్రాక్ట్ పద్ధతిన వాటర్ సప్లై పంపు ఆపరేటర్ గా పనిచేస్తూ అనుకోకుండా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తోటి మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, తమ వంతుగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి, కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వాటర్ సప్లై కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ నాయకులు మహేష్, దాసరి సురేష్ తోపాటు రెగ్యులర్ ఉద్యోగులు, తోటి కార్మికులు పాల్గొన్నారు.