Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం..

రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు.. జయసింహ, నాగభూషణ.
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా కర్తవ్యం అని రోటరీ క్లబ్ అధ్యక్షులు- బి. జయసింహ, కార్యదర్శి- డి. నాగభూషణం, కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరమునకు ముఖ్య అతిథిగా, దాతగా కలవల మురళీధర్ పాల్గొన్నారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ మా డోటరీ క్లబ్బు సంస్థ ద్వారా ఇప్పటికే వేలాదిమందికి కంటి వెలుగుతో పాటు ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం మాకెంతో సంతోషంతో పాటు తృప్తిని కూడా కలిగించిందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తము 237 మంది రోగులు పాల్గొనగా వారందరికీ పరీక్షలు నిర్వహించగా 130 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి సంవత్సరము జూలై నెలలో కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం వీరి భర్త కలవల మురళీధర్-(సుకన్య సిల్క్స్ ధర్మవరం వారు) కుమారుడు కలవల నాగ తేజ కోడలు శర్వాణి మనవడు కలవాలా బిహాను వారు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని, ఇది కంటి రోగులకు వరం లాగా మారడం జరిగిందని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచితంగా లెన్స్ కూడా అమర్చబడును అని తెలిపారు. ఆపరేషన్కు ఎంపికైన వారికి రవాణా సౌకర్యము, భోజనము, ఇతర సౌకర్యాలు కూడా, ఉచిత ఆపరేషన్, కంటి అద్దాలు ఉచితంగా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పల్స్ పోలియో వ్యాధి రాకుండా పల్స్ పోలియో(టీకా) కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ మాత్రమే చేపట్టడం జరుగుతుందని, అందరి సహాయ సహకారాలతో పోలియో వ్యాధిని కూడా నిర్మూలించడం జరిగిందని తెలిపారు. పేద ప్రజల కోసమే రోటరీ క్లబ్ ఉంది అని, వివిధ సేవా కార్యక్రమాలను కూడా మా క్లబ్బు చేపట్టడం జరుగుతోందని వారు తెలిపారు. మా సేవా కార్యక్రమాలను పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రతినెల రెండవ ఆదివారం తప్పనిసరిగా మా శిబిరం ఉంటుందని వారు తెలియజేశారు. అనంతరం దాత కలవల రామకుమారును, కంటి డాక్టర్ ను ఘనంగా రోటరీ క్లబ్ వారు సత్కరించారు.ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్న కుమార్, రమేష్ బాబు, మాజీ అధ్యక్షులు శివయ్య, కృష్ణమూర్తి, రామాంజనేయులు, మనోహర్ గుప్తా, తదితర సభ్యులతో పాటు కంటి చికిత్సకు వచ్చిన రోగులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img