London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

మాంగల్య షాపింగ్ మాల్ను తొలగించేంతవరకు మా పోరాటాలు ఆగవు..

స్థానిక వస్త్ర వ్యాపారుల సంఘం

ఆరోగ్యశాఖ మంత్రి కు వినతి పత్రాన్ని అందజేసిన వస్త్ర వ్యాపారస్తుల సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల కొన్ని నెలల కిందట ధర్మవరంలో మాంగల్య షాపింగ్ మాల్ను ప్రారంభించడం జరిగింది. దీంతో పట్టణంలోని స్థానిక వ్యాపారస్తుల యొక్క వ్యాపారం జరగక ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. ఈ సందర్భంగా పట్టణ వస్త్ర వ్యాపారుల సంఘం వారు తొలుత పట్టణములో ర్యాలీ నిర్వహించి, మాంగల్య షాపింగ్ మాల్ ను తొలగించాలన్న నినాదాన్ని హోరెత్తించారు. అనంతరం పట్టణానికి వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రికి తమ గోడును విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారస్తులు మాట్లాడుతూ”మన ఊరు-మన దుకాణం”అనే నినాదంతో కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మాలో చాలామంది ఉన్నత విద్యను చదివి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చిన్నచిన్న దుకాణాలు పెట్టుకుని జీవనాన్ని సాగిస్తున్నారని తెలిపారు. గత ఏడాదికాలంగా ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ పోషణ చేసుకొనలేక నెలసరి బాడుగలు కట్టలేక దుకాణంలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనికంతటికి కారణం కొన్ని నెలల కిందట మాంగల్య షాపింగ్ మాల్ను ప్రారంభించడమే కారణమని వారు వాపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ వ్యాపారం చేస్తున్నందువల్లనే స్థానికంగా ఉండే వ్యాపారస్తులు పూర్తిగా దెబ్బతిని, జీవనోపాధికి ఎంతో ఆటంకం కలుగుతోందని బాధను వ్యక్తం చేశారు.కరోనా లాంటి కష్ట సమయంలో కూడా తాము ఆత్మస్థైర్యం కోల్పోకుండా మంచి రోజులు వస్తాయి కదా అని మేము ఎదురు చూడగా నేడు మాంగల్య షాపింగ్ మాల్ రావడంతో మరింత దెబ్బతినడం జరిగిందని తెలిపారు. మాంగల్య షాపింగ్ మాల్లు వారు నాణ్యతలేని వస్త్రాలను దళారీల ద్వారా లాటుగా కొనుగోలు చేసి విపరీతమైన ఆఫర్లు పెట్టి మా బ్రతుకులను రోడ్డుమీద నిలబెట్టడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇంకా కొంతకాలం కొనసాగితే రైతు సోదరులు చేనేత కార్మిక సోదరులు మాదిరిగా తాము కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కుటీర పరిశ్రమ ద్వారా సుమారు 6000 మంది ఆధారపడి జీవిస్తున్నామని, మానవతా దృక్పథంతో మమ్ములను ఆదుకోవాలని వారు తెలిపారు. స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్యమంత్రితో తాను చర్చించి తమకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో వ్యాపారస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img