Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

దేవాదాయ భూములను కాపాడి న్యాయం చేయండి…

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు
విశాలాంధ్ర- ధర్మవరం:: నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం సర్వే నంబర్ 401లో19.84 చెట్ల భూమిని కొంతమంది అక్రమదారులు దొంగ డాక్యుమెంటరీ సృష్టించి డం దారుణమని ఆ భూములను కాపాడి న్యాయం చేయాలని ధర్మవరం నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సబ్ రిజిస్టార్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ బత్తలపల్లి మండలంలో గల భూమి మిడి మామిడి ఆంజనేయస్వామి మఠానికి చెందినట్లు తాము సమాచారం హక్కు చట్టం గా తెలుసుకోవడం జరిగిందని, ఈ భూమిలో కొన్ని సంవత్సరాలలో గ్రామాల్లో ఉన్నటువంటి మూగ, పశుపోషక సంబంధించి వాటికి ఆ భూములను ఉపయోగించే వారిని తెలిపారు. అయితే ఇప్పుడు కొంతమంది ఆక్రమ దారులు గత నెల 28వ తేదీన దొంగ డాక్యుమెంట్ను సృష్టించి, ఆ భూమి అంతా కూడా ఆక్రమించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగడం, సరైన పద్ధతి కాదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో కాకుండా ఆన్లైన్ అంటూ అనంతపురం కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ సర్వే నెంబర్ 401ని పూర్తిగా విచారణ జరిపి ఫేక్ రిజిస్ట్రేషన్ ఆపే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తదుపరి సబ్ రిజిస్టర్ అధికారి మాట్లాడుతూ విచారణ చేపట్టి న్యాయం చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు జింకా చలపతి, బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుల్లాయప్ప, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, చేనేత సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సకల రాజా, బత్తలపల్లి, ధర్మవరం సిపిఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img