ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు శివ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో గల వాసవి మహిళా జూనియర్ కాలేజీ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏవో అధికారికి వినతి పత్రాన్ని ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు శివ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కాలేజీలు నడుపుతున్నారని శనివారం ఆదివారం అనే సెలవులు కూడా పట్టించుకోకుండా అదనపు తరగతులు నిర్వహించడం దారుణమన్నారు. ర్యాంకుల కోసం విద్యార్థులను వేధించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలుమార్లు తాము సూచించిన కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రదీప్, మహేష్, ప్రవీణ్, పవన్, రాజా తదితరులు పాల్గొన్నారు.