Monday, May 20, 2024
Monday, May 20, 2024

వైద్యుల సేవలు మరుపురానివి…

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు అందించే సేవలు మరుపు రానివని, ప్రజల వద్ద మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల సూపర్డెంట్ గా ఉంటూ బదిలీ అయిన పద్మలత కు అభినందన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, ఏఎన్ఎంలు, సిస్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, అధికారులు అందరూ కలిసి పద్మలత దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నజీర్ మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి ఎంతో అమూల్యమైనదని, పవిత్రమైనదని తెలిపారు. ఆ వైద్య వృత్తికి పూర్తి దశలో సేవ చేసినప్పుడే వైద్యులందరికీ మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పద్మలత సూపర్డెంట్ గా నాలుగు సంవత్సరాలు చేసిన సేవలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చెందడంతో పాటు, ఆసుపత్రి సమస్యలు పరిష్కరించడంలో వారు కీలకపాత్ర వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుటలో ఆమెకు ఆమె సాటి అని తెలిపారు. పద్మలత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా బదిలీ కావడం జరిగిందని, అక్కడ కూడా వారి సేవలు మంచి గుర్తింపు వచ్చేలా అందించాలని వారు కోరారు. అనంతరం డాక్టర్ పద్మలత మాట్లాడుతూ తాను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు కొనసాగించిన సమయంలో వైద్యులతో పాటు నర్సులు, ఆఫీసు సిబ్బంది సహాయ సహకారాలతోనే అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రతి గుర్తింపు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికే దక్కుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిస్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img