Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

అతుల్ కుమార్ మృతి పట్ల శ్రద్ధాంజలి

ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి రమణ
విశాలాంధ్ర ధర్మవరం:: ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ మృతి పట్ల ధర్మవరం సిఐటియు కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి రమణ, జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, ఎస్హెచ్ భాష సీనియర్ నాయకులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, రవికుమార్, రమణ, పట్టణ కార్యదర్శి వెంకటనారాయణ, సహాయ కార్యదర్శి పొలాల లక్ష్మీనారాయణ ,చేనేత సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, సిపిఎం నాయకులు ఆదినారాయణ, చెన్నంపల్లి శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం నాయకులు తదితరులు సంతాపం తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జై వి రమణ పెద్దన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతుల సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళుతూ, రైతుల పక్షాన నిలబడి వారికే అనేక రకాల హక్కులను సాధించిన ఘనత దక్కిందని తెలిపా రు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నెలల చట్టాల రద్దుకై దాదాపు 13 నెలలపాటు పోరాటాలు నిర్వహించడం జరిగిందని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు కమిటీలో అతుల్ కుమార్ అంజన్ సభ్యుడుగా ఉంటూ రైతులకు అవసరమైన విధానాలు అమలు చేయాలని పోరాటం చేసిన మహా వ్యక్తి అన్నారు. రైతుల పోరాటాలలో అనేక సార్లు జైలుకు వెళ్లడం కూడా జరిగిందన్నారు. అటువంటి వ్యక్తి తుది శ్వాస విడవడం రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి, సిపిఎంకు తీరని లోటు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img