Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

అక్రమ మద్యంపై ఉక్కుపాదం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో ఎక్కడ కూడా అక్రమ మద్యం, నాటు సారా నిల్వ ఉంచిన, అమ్మిన కఠిన చర్యలు గైకొనాలని అనంతపురంకి చెందిన స్బ్ డిప్యూటీ కమిషనర్ విజయ శేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ధర్మవరం సేబ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్లో కేసుల పురోగతి, రికార్డులను, ప్రాపర్టీని తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎవరికైనా అక్రమంగా మద్యం, నాటు సారా నిల్వ ఉంచిన, అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేబ్బ్ సీఐ గురు ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img