Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

చందా గోవిందప్ప కు ఘన నివాళులు

విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త, చందా గోవిందప్ప మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా మృతి చెందగా బుధవారం వారికి అంతక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను పలువురు కొనియాడారు. పట్టణంలో శ్రీ శక్తి సిల్క్ హౌస్ ఫౌండర్ గా ఉంటూ, తన కుటుంబాన్ని పోషించుకునేవారు. అదేవిధంగా సేవా కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘానికి తొలుత అధ్యక్షులుగా సేవలు అందిస్తూ, మంచి గుర్తింపు పొందారు. అదేవిధంగా సోమందేపల్లి అప్పట్లో గ్రామ పంచాయతీ లో ప్రెసిడెంట్ గా ఉంటూ, తిరిగి ధర్మవరంలో సిరపడ్డారు. చందా గోవిందప్ప అనారోగ్యంతో మృతి చెందడం పట్ల పట్టణ ప్రముఖులు మృతదేహం వద్ద ఘన నివాళులు అర్పించారు. 15 సంవత్సరాల క్రిందట లయన్స్ క్లబ్లో సభ్యులుగా సేవలను అందించారు. వ్యాపారస్తులు, తొగట వీర క్షత్రియ సంఘం కమిటీ వారు వీరి మృతి పట్ల సంతాపం, ఘన నివాళులు తెలిపారు. వీరి కుమారుడు చందా జయ చంద్ర ప్రస్తుతం రోటరీ క్లబ్ లో సేవలను కొనసాగిస్తున్నారు. నివాళులు అర్పించిన వారిలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ప్రముఖ పట్టణ వ్యాపారస్తులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img