Friday, October 25, 2024
Friday, October 25, 2024

ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్.. కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు

విశాలాంధ్ర- ధర్మవరం;; పట్టణములో ఇటీవల కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు చోరికి గురవుతున్నాయి. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ఈ వాహనాల చోరీ కేసులో విషయంపై ప్రత్యేక శ్రద్ధను ఘనపరిచి కొన్ని టీములను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు టూవీలర్ ఇద్దరు దొంగలను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని బడే షాప్ వీధికి చెందిన గుర్రంపాటి రాకేష్ రణదీప్, ధర్మవరం పట్టణానికి చెందిన బోయ వీధి కు చెందిన నీలి సతీష్ కుమార్, మేకల నరసింహులు రాబడిన సమాచారం మేరకు కూలి పని చేసుకుంటూ వీరు జీవనం కొనసాగించేవారని, మద్యం తో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి చెడు వ్యసనాలను తీర్చుకొనుటకు వారు సంపాదన సరిపోనందున ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం, ఇప్పటికీ రెండు నెలల క్రితం సాలే వీధి మాధవ నగర్, రాఘవేంద్ర స్వామి ఫంక్షన్ హాల్, పి ఆర్ టి వీధి తదితర ప్రదేశాలలో ఇంటి యందు పార్కు చేయబడిన ఏడు టీవీఎస్ ఎక్సెల్, ఒక అపాచీ బండిని దొంగతనం చేయడం జరిగిందని తెలిపారు. దొంగతనమునకు ఉపయోగించే ఒక కటింగ్ బ్లేడు ఒక వైరు కట్టర్లను వారి వద్ద నుండి స్వాధీనం పరచుకోవడం జరిగిందని తెలిపారు. పై ముగ్గురు ముద్దాయిలలో గుర్రంపాటి రాకేష్ రణదీప్ నీలి సతీష్ కుమారులను అరెస్టు చేసి వారి నుండి ప్రాపర్టీని స్వాధీన పరుచుకొని కోర్టుకు పంపడం జరిగిందని తెలిపారు. పై కేసు నందు రెండవ ముద్దాయి అయినటువంటి మేకల నరసింహులు అరెస్టు కావలసి ఉందని తెలిపారు. ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో పట్టణములోని శివానగర్ శివాలయం దగ్గర ఉన్న పాడుబడిన ఇంటి ముందర రాబడిన రహస్య సమాచారం కు వెళ్లి, సీఐ సుబ్రహ్మణ్యం తో పాటు ఏఎస్ఐ 1052, బీసీలు 707, 1498,1499,2998,3638 సహాయముతో అరెస్టు చేయడం జరిగిందన్నారు. మొత్తం 12 ద్విచక్రాలను(విలువ రూ.5,05,000) స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి, కోర్టుకు పంపడం జరిగిందన్నారు. ఈ కేసును చేదించిన సీఐ సుబ్రహ్మణ్యం, ఏఎస్ఐ పుట్టప్ప, కానిస్టేబుళ్లు వెంకటేష్ బయన్న అబ్దుల్లా, ఆదినారాయణ, నాగేశ్వరరావు లను డిఎస్పి శ్రీనివాసులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img