Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

ప్రభుత్వ క్రీడా మైదానంలో ఎల్ఈడి స్క్రీన్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వీక్షణ

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 12వ తేదీ అనగా బుధవారం రోజున టిడిపి పార్టీ అధినేత, అధ్యక్షులు, నాలుగవసారి ముఖ్యమంత్రి అయినా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకార మహోత్సవ వేడుకలను ఎల్ఈడి స్క్రీన్ లో ప్రజల కొరకు టిడిపి శ్రేణులు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలను చూడడానికి వేలాదిమంది ఎల్ఈడి స్క్రీన్ లో ప్రమాణ స్వీకార వీక్షణ గావించడం జరిగింది. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి పార్టీల ఎన్డీఏ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ప్రజలు ఉద్యోగులు వీక్షించేలా తగు చర్యలు కూడా అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది. వేలాదిమంది నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, ఎన్డీఏ విభాగం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవ సమయం రాగానే కేరింతలు, విజిల్లతో దద్దరిల్లింది. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి మహిళలు స్క్రీన్ కు ముందు మంగళహారతులు కూడా ఇచ్చారు. జై చంద్రన్న, జై ఎన్డీఏ కూటమి, జై జనసేన, జై జై బిజెపి, భారత్ మాతాకీ జై అన్న నినాదాలు క్రీడా మైదానంలో మారుమోగాయి. క్రీడా మైదానం అంతా ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో అందరూ మునిగిపోయారు. ఏర్పాటు పట్ల అందరూ కూడా కృతజ్ఞత తో కూడిన హర్షం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సత్య కుమార్ యాదవుల ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహాన్ని పార్టీ శ్రేణుల్లో కలిగించాయి. ఏది ఏమైనా ఎన్ డి ఏ కూటమి తరఫున సత్య కుమార్ యాదవ్ గెలుపు కొరకు కృషి చేసిన వారందరికీ ఇదొక మంచి అవకాశంగా, ఆనందపరితంగా ఉండిపోయి సాగింది. సత్య కుమార్ యాదవ్ 45 రోజుల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం నిర్వహించి, అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంచి మన్ననలు పొందిన సత్య కుమార్ యాదవ్ కి మంత్రివర్గంలో స్థానం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img