Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కళలను కాపాడుతున్న భజనల బృందాలు

బొబ్బిలి యువరాజు బేబీనాయన
సీతానగరం: అంతరించి పోతున్న కళలను కాపాడటంలో భజనల బృందాలు చేస్తున్నకృషి గొప్పదని బొబ్బిలియువరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్, బొబ్బిలి టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబీనాయన తెలిపారు.బుదవారం మండలంలోని జోగమ్మపేటగ్రామంలో ఆడిటర్, మక్కువ మాజీఎంపిపి పెంటతిరుపతిరావు, కర్రి రాములు ఏర్పాటుచేసిన కార్తీకమాస అన్న సంతర్పణకార్యక్రమం, వివిధగ్రామాలకు చెందిన భజనబృందాలు కార్యక్రమాన్ని ఆయనచేతులుమీదుగా ప్రారంభం చేశారు.ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయనమాట్లాడుతూ భజనబృందాలుద్వారా ఆధ్యాత్మికత పెరుగుతుందన్నారు.
గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి పాటలరూపంలో భజనబృందాలు చేస్తున్నకృషి ఎనలేనిదన్నారు. ఈకార్యక్రమంలో జనసేన జిల్లానేత మర్రాపు సురేష్, సర్పంచ్ కల్యంపూడి.సింహాచలం, కొల్లి తిరుపతిరావు, పోలఈశ్వరనారాయణ, పోల వెంకటనాయుడు, వెంకటరమణ పంతులు,సురేష్, సబ్బాన శ్రీనివాసరావు, లక్ష్మణ,భజనబృందాల గురువులు విమల, కూర్మినాయుడు, సుబ్బినాయుడు, శ్రీఆంజనేయ ఆలయ భజనమండలి సభ్యులు, సుబ్బమ్మ పేరంటాల సభ్యులు, గ్రామపెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బేబీనాయనను, పెంట తిరుపతి రావులను గ్రామపెద్దలు ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img