Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నిండు గిరిజన గర్భిణీ మృతి

విశాలాంధ్ర – కురుపాం : ఎనిమిది నెలల నిండు గిరిజన గర్భిణీ సకాలంలో నాణ్యమైన వైద్యం అందక విశాఖపట్నం కెజిహెచ్ ఆసుపత్రిలో శనివారం వేకువజామున తుదిశ్వాస విడిచింది.పార్వతీపురం మన్యం జిల్లా లోని కురుపాం నియోజక వర్గ పరిధిలోని మేజర్ పంచాయతీ కురుపాం పరిదిలోగల మంతినవలస ఎస్టీ (గదబ)కు చెందిన గొర్లి. సునీత(26) ఎనిమిది నెలల గర్భిణి ప్రతీనెల వైద్యపరీక్షలు చేసుకుని మందు లు వాడుతుంది.ఈనెల23ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువగా రావడంతో భర్త గొర్లి. రమేష్ కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం నకు తీసుకునివెళ్ళగా అత్యవసర వైద్యం కోసం పార్వతీపురం జిల్లాఆసుపత్రికి రిఫర్ చేశారు.అక్కడి నుండి విజయనగరం తీసుకుని వెళ్ళాలని సూచించారు. విజయనగరం నుంచి శుక్రవారంరాత్రి విశాఖ కెజిహెచ్ కు రిఫర్ చేయగా కెజిహెచ్ లో చేరిన కొద్దిసమయంలో రక్తంతో వాంతులు చేసుకుని ప్రాణాలు విడిచినట్లు భర్త తెలిపారు. సకాలంలో నాణ్యమైన వైద్యంఅందిఉంటే తన భార్య ,బిడ్డ బ్రతికిఉండేవారని లబోదిబోమంటున్నారు. ఈనెల 21నమంతిన వలసలో నిర్వహించిన ప్యామిలీ ఫిజీషియన్ వైద్యశిబిరంలో వైద్యపరీక్షలు నిర్వహించినపుడు పూర్తి ఆరోగ్య వంతంగానే ఉందని వైద్యసిబ్బంది తెలిపారు. ఊపిరితిత్తులలో నీరుచేరటం తో ఇన్పెక్షన్ వచ్చిన కారణంగా వాంతులు ఎక్కువగా అవుతున్న కారణంగా ఊపిరి ఆడటం లేదని ,బిపి పెరిగి పోయినట్లు విజయనగరం ఘోష ఆసుపత్రిలో సిబ్బంది తెలిపారని భర్త రమేష్ తెలిపారు. ఏదిఏమైనా అత్యంత ఆధునిక పద్దతిలో వైద్యం అందుబాటులో ఉన్న సమయంలో ఇలా నిండు గర్బినీ మ్రృత్యుఒడి చేరడంపై తీవ్రఆవేదనను బంధువులువ్యక్తంచేశారు. ఈనెల 28న సీఎం ప్రోగ్రాం కురుపాంలో ఉండటంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యసిబ్బంది తగు చర్యలు తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలి.పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉండగా అక్కడ నుండి ఎక్కువగా విజయనగరం, విశాఖపట్టణం లకు ఎక్కువగా రిఫర్ చేయడంపై ఇక్కడ రోగులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలపై జిల్లా కలెక్టరు విచారణ జరిపి ముందు ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ మన్యం జిల్లా కార్యదర్శి కె. మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్లు డిమాండ్ చేశారు. రిఫరల్ విధానం గూర్చి కూడా విచారణ చేయాలని కోరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img