Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఓటరు నమోదును గడువులోగా చేసుకోండి

జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్
విశాలాంధ్ర,పార్వతీపురం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు గడువుతేదీలోగా నమోదు చేసుకోవాలని జిల్లా కలక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 7లోగా అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఓటుహక్కును నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో ఉండే గ్రాడ్యుయేట్లకు ఉండే ఓటుహక్కును రద్దుచేయడం జరిగినందున ప్రతీఒక్కరు కూడా కొత్తగా నమోదు చేసుకోవాలని కోరారు.డిగ్రీ, ఇంజనీరింగ్, డిగ్రీకి సమానమైన డిప్లొమా, ఓపెన్ డిగ్రీ, ఎంబీబీఎస్, అగ్రికల్చర్, ఆయుర్వేదిక్ డిగ్రీపట్టభద్రులు అర్హులని
చెప్పారు.ఈఓటుహక్కు నమోదుకు ఫారమ్-18, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్ ), ఆధార్ కార్డు  మరియు ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోఒకటి కలిగిఉండి ధరఖాస్తు లను ఆర్డీవో లేదా ఎమ్మార్వో కార్యాలయంలో లేదా ఎంపిడిఓ కార్యాలయంలో సంబంధిత పత్రాలు జతచేసి అందజేయాలన్నారు.మరిన్ని వివరాలకు ఆర్ డి ఓ కార్యాలయము లేదా తహశీల్దార్ కార్యాలయం లేదా ఎంపిడిఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇప్పటికే సాధారణ ఓటుహక్కు కలిగినవారు తమఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు నమోదును ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img