Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

సైన్స్ తో మానవ మేధస్సు వికసిస్తుంది :

గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల

విశాలాంధ్ర, పలాస: సైన్స్ తో మానవమేధస్సు వికసిస్తుందని గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనాల గోపాల్ అన్నారు. బుధవారం ప్రపంచ సైన్స్ దినోత్సవం సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం డోకలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెర్రీ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలు అంద విశ్వాసాలు పారద్రోలి సన్మార్గంలో నడిపించేది సైన్స్ అని అన్నారు. చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం వైపు నుండి జ్ఞానం వైపు తీసుకు వెళ్ళేది సైన్స్ మాత్రమే అని అన్నారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎవరి కాంతారావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి సైన్స్ పట్ల అవగాహన కలిగి శాస్త్రవేత్తలగాను ఉన్నత విద్యావంతుల గాను ఎదిగి సమాజం కోసం పాటుపడాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆలోచన చేసి కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు జి భీమేశ్వరరావు, ఉపాధ్యాయులు ఎం రవీంద్రనాథ్ ఠాగూర్, కే.పుణ్యవతి, గ్రీన్ ఆర్మీ సభ్యులు ఉదయ్ శంకర్ పాత్రో, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img