Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎంపిడిఓ కార్యాలయంలో స్వమిత్వపై సమావేశం

విశాలాంధ్ర,సీతానగరం:గ్రామ పంచాయతీలలో జరుగుతున్న స్వమిత్వ జగనన్న భూహక్కు సర్వేలోభాగంగా గ్రామ కంఠంలోనిగృహాలు, ప్రభుత్వ ఆస్తులను పంచాయతీ కార్యదర్శులు అసెస్మెంట్ రిజిస్టరులో నమోదు చేయాలని తహశీల్దార్ ఎన్వీ రమణ, ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి లు పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో గ్రామ రెవిన్యూ అధికారులు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ సహయకుల్తో ఒకరోజు శిక్షణసమావేశం నిర్వహించారు. విఆర్ఓలు,సర్వేయర్లు గ్రామకంఠం సరిహద్దులను నిర్ణయించాలని,ఇంజనీరింగ్ అసిస్టెంటులు గృహాల కొలతలు వేయాలని, డ్రోన్ సర్వే జరిగిన పిమ్మట వచ్చిన మ్యాపులను రికార్డులతో సరిపోల్చుకుని గృహ యజమానులను సరిచూసుకోవాలన్నారు. చివరిగా సర్వే అండ్ లాండ్ రికార్డులను అమరావతి వారికి సమర్పించాలన్నారు. ఈసర్వేలో ఎటువంటి తప్పులు దొర్లకుండా గ్రామస్థాయి సిబ్బందితోపాటు ఎంపిడిఓ, తహశీల్దార్ ,మండల సర్వేయర్,
ఈఓపిఆర్డి, మండలటీం,డివిజనల్ పంచాయతీఅధికారి రికార్డులను తనిఖీ చేస్తూ న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి వర్మ, మండల సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img