Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మన్యం జిల్లాలో నాటుసారా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ద

1652మందిపై బైండోవర్-946మందిపై కేసుల నమోదు
మొదట సారిగా పిడి చట్టం కేసునమోదు:
పార్వతీపురం మన్యంజిల్లాఎస్పీ విద్యాసాగర్

విశాలాంధ్ర,పార్వతీపురం:మన్యం జిల్లా ఏర్పడిన దగ్గరినుండి నాటుసారాపై  ముఖ్యమంత్రి, రాష్ట్రడిజిపి ఆదేశాల మేరకు పోలీస్ మరియు ఎస్.ఈ.బి. శాఖల సమన్వయంతో నాటుసారాపై ఉక్కుపాదం మోపడంతోపాటు ఇంతవరకు1652 మందిని బైండోవర్ చేసి, 946 కేసులు నమోదు చేశామని, మొదటి సారిగా పిడి చట్టం కింద కేసు నమోదు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.జిల్లా ఏర్పడిన తరువాత ఇంతవరకు నమోదు చేసిన 946 కేసులలో1136 మందిని అరెస్టుచేసి జైలుకు పంపడం జరిగిందన్నారు.వారివద్దనుండి 43వేల లీటర్ల నాటుసారాను, 216 వాహనాలు, 1190 కేజీలనల్లబెల్లం, 215కేజీల అమోనియా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 1,82,842 లీటర్ల బెల్లపువూటను ధ్వంసంచేసామని చెప్పారు.నాటుసారాతయారీ, అమ్మకం,నిల్వచేసేవారిపై పిడియాక్టును ప్రయోగిస్తామన్నారు.దానిలోభాగంగా జిల్లాఏర్పడినతర్వాత మొట్టమొదటిసారిగా ఈచట్టాన్ని కొమరాడ మండలం విక్రమపురం గ్రామానికి చెందిన సొండి వినోదుపై అమలు చేశామని చెప్పారు.ఇతనిపై  పార్వతీపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ నందు నాలుగు కేసులు, కొమరాడ పోలీస్ స్టేషన్ నందు నాటు సారాయికేసులలో ముద్దాయిగా ఉన్నాడని చెప్పారు. ఇతడు  నాటుసారాను అమ్మకం మరియు  రవాణాచేస్తూ ఉంటాడని,ఇతని వద్దనుండి సదరు ఐదుకేసులలో 192 లీటర్ల నాటుసారాను, నాటుసారా రవాణాకు ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం  జరిగిందని చెప్పారు. సదరు ముద్దాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీస్ అధికారులు పలుమార్లు నాటు సారా అమ్మకం మరియు రవాణాను మానుకోమని అవగాహన కల్పించిన అతనిలో ఎటువంటి మార్పు రాలేక పోవడంతో  అతనిని ఈరోజున పీ.డీ ఏక్ట్ క్రింద అరెస్టు చేసి విశాఖ జైలుకు తరలించడం జరిగిందన్నారు. నాటుసారా రక్కసిమీద ఉక్కుపాదం మోపుతామని  ప్రజలు సహకరించాలని కోరారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు కూడా రూపొందించడం కోసం జిల్లాలోని 170 పైగా నాటుసారా ప్రభావితగ్రామాల్లో నేటి నుంచి ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈసందర్భంగా కష్టపడి పనిచేస్తున్న పలువురిని ఆయన అభినందించడంతో పాటు రివార్డులు అందజేశారు.ఆయనతో పాటు జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, ఎస్ఈబి, ఎస్ బి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img