Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

చట్టాలపై అవగాహన పొందండి


పార్వతీపురం డి.ఎస్పీ ఏ.సుభాష్


విశాలాంధ్ర, పార్వతీపురం: చట్టాలపై ప్రజలు అవగాహనను పెంచుకోవాలని పార్వతీపురం సబ్ డివిజనల్ పోలిస్ అధికారి ఏ.సుభాష్ పిలుపు నిచ్చారు.శనివారం మన్యం జిల్లాలోని మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలగురు గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా గ్రామస్తులకు పలుఅంశాలపై ఆయన అవగాహన కల్పించారు. మహిళలు పోక్సో చట్టం గూర్చి తెలుసు కోవాలని,దాని ద్వారా కేసులు నమోదయిన పక్షంలో విధించే శిక్షలు గూర్చి వివరించారు. గ్రామాలలో ప్రజలు
ఐక్యతగా ఉండి శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండేలా సహకారాన్ని అందించాలని కోరారు. బాల్య వివాహాలు నేరమని, తల్లితండ్రులు ఇటువంటి బాల్య వివాహాలను చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గ్రామాల్లో నాటుసారా నియంత్రణను అందరూ సామాజిక భాద్యతగా తీసుకోవాలన్నారు. పిల్లలకు విద్యను అందించేలా తల్లిదండ్రులు దృష్టి సారించాలని, పోషకాహార విలువల ఆహారాన్ని వారికి అందజేయాలని కోరారు. పిల్లలను తల్లిదండ్రులు క్రమశిక్షణగా ఉంచేలా పెంచాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతీ మహిళవాడే సెల్ ఫోన్లో దిశ యాప్ నమోదును తప్పని సరిగా చేసుకొని మహిళలరక్షణకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతీఒక్కరూ చట్టాలను గౌరవించి నడుచుకోవాలని కోరారు. రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరముగా ఉండాలని కోరారు. ఆయనతో పాటు పాచిపెంట ఎస్ ఐ మామిడి వెంకట రమణ, మక్కువ పోలిస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img