Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

జాతీయ స్కాలర్ షిప్ కు మోడల్ స్కూల్ విద్యార్థులు

విశాలాంధ్ర-రాప్తాడు : గత నెలలో జరిగిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న సరిత, శ్రీచరిష్మా, గృహిత, ధరణి, ఉషశ్రీ, సహస్ర అనే ఆరు మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పద్మజాదేవి శనివారం తెలిపారు. మా పాఠశాలలోని విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన గుణాత్మక విద్యనందించడం వల్ల జాతీయ స్కాలర్‌షిప్పుకు ఎంపికవడంతో నాలుగేళ్ళపాటు ఏడాదికి రూ. 12000 పొందుతారని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img