Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

నిజాంసాగ‌ర్ లో భారీ వ‌ర్షం పంట చేలు మునిగి అన్న‌దాత కుదేలుౌ

నిజాం సాగర్ మండలం లోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న వడగళ్లతో కూడిన వర్షానికి రైతులు సతమతం అవుతున్నారు. కొన్ని పంట పొలాలు కోయకుండానే వరి ధాన్యం రాలిపోవడంతో పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదు అని రైతులు దిగులు చెందుతున్నారు. నిజాంసాగర్ మండలం నర్వ గ్రామంలో ఓ రైతు మనోవేదనతో కుమిలిపోతూ వరి ధాన్యాన్ని చూసి కన్నీటి పరితమయ్యారు. ఇప్పటివరకు ఏ అధికారి కూడా వచ్చి నష్టపోయిన రైతులకు కనీసం ఆదుకుంటామని భరోసానిచ్చే వారు కరువయ్యారని పలువు రైతులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు మాత్రం తూతు మంత్రం గా వచ్చి ఫోటోలు దిగి వెళ్లిపోవడం తప్ప రైతుల బాధలను పట్టించుకునే వారు సమస్యలను పరిష్కరించి బాధలు తీర్చేవారు లేరు అని ఇప్పటికైనా స్పందించి రైతులకు అండగా నిలవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img