Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి:మంత్రి ఎర్రబెల్లి

పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు. రాష్ట్రంలో 5వ విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర పల్లెలు బాగు పడుతున్నాయని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు. గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 3వ తేదీ నుండి చేపట్టనున్న 5వ విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతి సన్నాహక సమీక్ష సమావేశాన్ని జనగామ కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టడమే విజయానికి కారణంగా పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో 20 పంచాయతీలు గుర్తింపు పొందగా అందులో 19 పంచాయతీలు జనగామ జిల్లాలో ఉండటం గర్వకారణంగా పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ముందుండటం గర్వకారణమన్నారు తండాలు, గూడెంలు ప్రగతి బాట పట్టాయి అంటే ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అన్నారు.ఇదే తరహాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వినియోగంలోకి తెస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. అందుకు అవగాహన ఒక్కటే ప్రాధాన్యమని అధికారులు గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిత్యం ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని సేకరించిన చెత్త సెగ్రిగేషన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్మి కంపోస్టు చేపట్టి గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచాలన్నారు. వైకుంఠ దామాల నిర్వహణ తప్పనిసరిగా జరగాలన్నారు. వైకుంఠధామంలలో పూల మొక్కలతో ఫెన్సింగ్‌ చేపట్టాలని నీటి సౌకర్యం కల్పించాలన్నారు.పట్టణ ప్రగతిలో రూ.8 కోట్లు డ్రైనేజీలకు కేటాయించడం జరిగిందని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img