Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రైతుల విషయంలో మాత్రం రాజకీయాలు వద్దు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జడ్పీ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి మంత్రి మాట్లాడారు.ఏడేళ్ల కాలంలో రాష్ట్రం, పాలమూరు ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభవృద్ధి, సంక్షేమ పనులు మీరెందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇక్కడి భూముల్లో ఏ పంటలు పండుతాయో వాటినే పండిస్తాం. ఇక్కడ ఎమైనా ఆపిల్‌ పండుతుందా అని ఎద్దేవా చేశారు. మేం వరి పంట సాగు చేస్తే మీరు కొనం అంటే ఎట్లా అని ప్రశ్నించారు. ఏ విషయంలోనైనా రాజకీయం చేయండి రైతుల విషయంలో మాత్రం రాజకీయాలు వద్దు అని హితవు పలికారు. ప్రజలను కాన్ఫ్యూజ్‌ చేయకండని,,చేస్తే మీరు కన్ఫూజ్‌ అవుతారని మంత్రి తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులు పండిరచిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img