Friday, October 25, 2024
Friday, October 25, 2024

నేడు జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి పై సమీక్ష

జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టే విషయంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు.. ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు మంగళవారం రోజున ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. . ఎన్హెచ్-163లో మంచిర్యాల ఉ వరంగల్‌ ఉ ఖమ్మం ఉ విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూములు అప్పగించాల్సి ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు. ఎన్ హెచ్ ఉ 63లో ఆర్మూర్‌-జగిత్యాల- మంచిర్యాల రహదారికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇక ఎన్ హెచ్ -563లో.. వరంగల్- కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ప్లైయాష్ కావాలని పేర్కొన్నారు. ఎన్ హెచ్-44తో కాళ్లకల్‌-గుండ్ల పోచంపల్లి రహదారిౌ ఆరు వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణ చేయాలని ౌ ఖమ్మం- దేవరపల్లి, ఖమ్మం-కోదాడరహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. ఆ వినతులపై స్పందించిన సీఎం.. సమస్యల పరిష్కారానికి నేడు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img