Tuesday, October 29, 2024
Tuesday, October 29, 2024

బుచ్చమ్మది ప్రభుత్వ హత్య

. కాంగ్రెస్‌ పాలనలో పేదల ఇళ్లల్లో చీకట్లు
. బిల్డర్లను బెదిరించి చందాలు
. సీఎం రేవంత్‌రెడ్డి చర్యలపై కేటీఆర్‌ ధ్వజం

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా పేదల ఇళ్లల్లో చీకట్లు కమ్మా యని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హైడ్రా కూల్చివేతల భయంతో కూకట్‌పల్లిలో ప్రాణాలు కోల్పో యిన బుచ్చమ్మ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనాలోచి తంగా నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టారని మండిపడ్డారు. హైడ్రా అనే బ్లాక్‌ మెయిల్‌ సంస్థను పేదలపైకి ఉసిగొల్పి, నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం కాంగ్రెస్‌ ప్రభుత్వం సృష్టించిందని విమర్శించారు. పిల్లలు పుస్తకాలైనా తీసుకుంటామంటే తీసుకోనివ్వలేదన్నారు. ఎక్కడ నా ఇల్లు కూలగొడుతారమోనని ఇళ్ల బుచ్చమ్మ ( 52) ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. అనుమతులు ఇచ్చి, పన్నులు కట్టించుకొని వాళ్లే ఇల్లు కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఇది ఆత్మహత్య కాదు… హైడ్రాతో సీఎం రేవంత్‌ రెడ్డి చేయించిన హత్య అన్నారు. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూలగొట్టారని చెప్పారు. రేవంత్‌ రెడ్డీ… నీ అన్నకు ఎఫ్టీఎల్‌లో ఉన్న ఇల్లుకు నోటీసులిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు కడతాం, నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇస్తాం అన్నారు కానీ ఒక్క ఇళ్లు కట్టలేదు కానీ ఇళ్లు కూలగొట్టడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించి చందాలు తీసుకోవడంపైనే ఈ ప్రభుత్వం శ్రద్ద చూపిస్తుందన్నారు. గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులందరికీ బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్‌ ప్రజలు మాకు ఓటు వేసినందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పగ, కసి పెంచుకుందని ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img