Monday, May 20, 2024
Monday, May 20, 2024

స‌చివాల‌య ప్రారంభోత్స‌వానికి ఆహ్వాన‌మే లేదు – గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్‌ భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాకపోవడంపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గౌరవ గవర్నర్‌కు ఆహ్వానం అందిందని, ఆహ్వానం అందించినప్పటికీ గవర్నర్ హాజరు కాలేదన్న నిరాధారమైన, తప్పుడు ఆరోపణలను రాజ్‌భవన్‌ తీవ్రంగా ఖండించింది. కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై ను ఆహ్వానిస్తూ ఎలాంటి ఇన్విటేషన్ పంపలేదని, కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఆమె రాకపోవడానికి ఇదే ఖచ్చితమైన కారణం అంటూ రాజ్ భవన్ స్పష్టం చేసింది.. ఇలాంటి ప్రచారం తగదంటూ రాజ్ భవన్ మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ రాలేదు. ఆహ్వానం పంపామని చెప్పడం తప్పు.. ఆహ్వానం రానందుకు గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళలేదు అంటూ రాజ్ భవన్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img