Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆచరణ సాధ్యం కానిఒకే దేశం-ఒకే ఎన్నికలు

ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న సూత్రాన్ని 2029 లోకసభ ఎన్నికల సమయం నుంచి అమలు చేసేయాలన్న మోదీ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసేసింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా మాత్రమే. మిగతా రాష్ట్రాల కాలావధిలో తేడాలున్నందువల్ల భిన్న సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనితో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అలా కాకుండా లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలని మోదీ ప్రయత్నం. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించడానికి గత ఏడాది సెప్టెంబర్‌లో మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన ఈ కమిటీకి నేతృత్వం వహించడానికి అంగీకరించడమే వింతల్లోకెల్లా వింత. మాజీ రాష్ట్రపతులను ఇలాంటి పనులకు వినియోగించుకోవడం ఆ స్థానాన్ని కించపరచడమే. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ సింఫ్‌ు మేఘ్వాల్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే ఉన్నారు. రాంనాథ్‌ కోవింద్‌ వివిధ కారణాలవల్ల మోదీకి అనుకూలుడే. మిగతా ఇద్దరు సభ్యులు మోదీ మంత్రివర్గంలోని వారే. హరీశ్‌ సాల్వే ఇటీవలి దాకా భారత సోలిసిటర్‌ జనరల్‌గా ఉన్నారు. ఇలాంటి వారితో కూడిన కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో చెప్పక్కర్లేదు. గత మార్చిలో కోవింద్‌ నివేదిక రాష్ట్రపతి ముర్ముకు సమర్పించారు. లోకసభ, శాసనసభ ఎన్నికలతో పాటే కాకపోయినా ఆ తరవాత స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కోవింద్‌ కమిటీ సిఫార్సు చేసింది. అవి వంద రోజుల ఎడంతో నిర్వహించినా ఫరవా లేదట. స్థానిక సంస్థలు దేశమంతటా ఉంటాయి కనక ‘‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’’ అన్న సూత్రానికి గండి పడినట్టే. దేశమంతటా ఎన్నికలు నిర్వహిస్తే ఒనగూరే లాభాలు ఏమిటో ఈ కమిటీ ఏకరువు పెట్టింది. మొదటిది ఖర్చు తగ్గుతుందట. ఎన్నికల ప్రక్రియ సులభం అవుతుందట. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందట. అందువల్ల ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉంటుందట. అక్కడికి ఆర్థిక వ్యవస్థ అస్థిరం కావడానికి ఎన్నికలు మాత్రమే అడ్డంకి అయినట్టు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, సుస్థిరతకు ప్రధాన కారణం ప్రభుత్వం అనుసరించే ఆర్థిక వ్యవస్థలో మంచి చెడ్డలే ప్రధాన కారణం అన్న వాస్తవాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఎన్నికలప్పుడు వలస కార్మికులు ఓటు వేయడానికి సొంత ఊర్లకు వెళ్లడం వల్ల సరఫరాలు, ఉత్పత్తికి ఆటంకం కలగదట. ఎన్నికలు అమలు జరుగుతున్నప్పుడు ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది కనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించడానికి భిన్న సమయాల్లో ఎన్నికలు జరగడం అడ్డంకిగా ఉందట. సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే దేశమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాలలో మాత్రమే ఈ నియమావళి అమలవుతుంది. దేశమంతా ఒకే సారి ఎన్నికలు జరిగితే విధాన నిర్ణయాలకు విఘాతం కలగదట. అక్కడికదే గొప్ప ప్రజాస్వామ్య పరిరక్షణా క్రతువు అయినట్టుగా వాదిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఆ రాష్ట్రాలలో మోదీ ఆసుపోసినట్టు పదే పదే పర్యటించి వాగ్దానాల జడివాన కురిపించడం ఏ లెక్కన ప్రజాస్వామ్యాన్ని పదిలం చేస్తుందో తెలియదు. ఒకే సారి ఎన్నికల నిర్వహణ వల్ల పోలింగ్‌ శాతం పెరుగుతుందట. పోలింగ్‌ శాతం పెరగడానికి, తగ్గడానికి ఓటర్ల ఆసక్తి, నిర్లిప్తత ప్రధాన కారణాలు. ఒకే సారి ఎన్నికలు జరిగినంత మాత్రాన ప్రభుత్వాలపై అసంతృప్తి ఎక్కువగా ఉంటే ఓటర్లలో నిర్లిప్తత తప్పదు. 2019, 2024 బీజేపీ ఎన్నికల ప్రణాళికలలో దేశమంతటా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. అందువల్ల 2029 నుంచి అమలు చేసేయాలని తొందరపడ్తున్నారు. రాంనాథ్‌ కోవింద్‌ కమిటీకి 21,000 సూచనలు అందాయట. అందులో 81 శాతం మంది ఒకే తడవ ఎన్నికలను సమర్థించారట. దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే సూచనలు చేసిన 21,000 మంది అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఉంటుంది? పైగా కోవింద్‌ కమిటీ వివిధ దేశాలలోని ఎన్నికల విధానాన్ని అధ్యయనం చేసి ఒకే సారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఈ అంశంపై ఆర్థికవేత్తలను, న్యాయ నిపుణులను సంప్రదించారట. వారి రూపు రేఖా విలాసాలు కచ్చితంగా మోదీని సమర్థించేవే అయి ఉంటాయి. ఒకే దేశం, ఒకే ఎన్నికల సూత్రానికి ఉన్న అడ్డంకులను ఏకరువు పెడ్తున్న నిపుణుల, విజ్ఞుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోనే లేదు.
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అన్న మోదీ ముచ్చట తీర్చడానికి కనీసం అయిదు రాజ్యాంగ సవరణలు చేయాలి. పార్లమెంటు కాలపరిమితికి సంబంధించి 83వ అధికరణాన్ని, లోక్‌సభ రద్దుకు సంబంధించిన 85వ అధికరణాన్ని, శాసనసభల కాలావధికి సంబంధించిన 172వ అధికరణాన్ని, శాసనసభల కాలావధికి సంబంధించిన 174వ అధికరణాన్ని, రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన 356వ అధికరణాన్ని సవరించవలసి వస్తుంది. ఈ సవరణలన్నీ చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉభయ సభల్లోనూ మోదీ పార్టీ అయిన బీజేపీకి లేదు. ఒక వేళ లోక్‌సభను రద్దు చేయాల్సిన అవసరం వస్తే అన్ని రాష్ట్రాల శాసనసభలకు ‘‘అనవసరంగా’’ ఎన్నికలు రద్దు చేస్తారా? వాటి కాలావధిని కేంద్రం ఇష్టానుసారం మార్చడం ఏ రకంగానూ ప్రజాస్వామ్య బద్ధమైంది కాదు. ఏ రాష్ట్ర శాసన సభ అయినా గడువు పూర్తి కాక ముందే రద్దయితే లోక్‌సభ ఎన్నికలు జరిగేదాకా అక్కడ శాసనసభ లేకుండానే ఉంచుతారా? ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి గండి పెట్టడమేగా! ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే ఉండే ప్రయోజనాల గురించి మోదీ సర్కారు కబుర్లు చెప్పొచ్చు. అదే లక్ష్యం అయితే ఒక రాష్ట్రంలోనే ఆరేడు దశల్లో ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్థితి ఎందుకు వస్తోంది. 39 రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్థించా యంటున్నారు. వాటిలో ఎన్నికలలో పాల్గొంటున్నవి ఎన్నో చెప్పొచ్చుగా. నికరంగా పదిహేను పార్టీలు ఈ విధానం ఫెడరల్‌ వ్యవస్థను ఛిద్రం చేయడమేనంటున్నాయి. దీనికి మోదీ దగ్గర సమాధానం లేదు. ఆయన దృష్టి అంతా ఏకచ్ఛాత్రాధిపత్యం మీదే. లోక్‌సభకు, శాసనసభలకు ఒకే సారి ఎన్నికలు జరిగినా రెండు చోట్లా ఒకే పక్షానికి ఓటు వేస్తారన్న హామీ ఏమీ లేదు. శాసనసభ ఎన్నికలలో స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. లోక్‌సభకు ఓటేసేటప్పుడు గమనంలోకి తీసుకునే అంశాలు భిన్నంగా ఉంటాయి. దిల్లీలో వరసగా ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపిస్తున్న ఓటర్లు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని గెలిపిస్తున్నారుగా! సందర్భాన్ని బట్టి ప్రజల నిర్ణయం ఉంటుంది. పైగా ఒకే సారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు తమ విధానాలను ప్రజల ముందుంచే అవకాశం తగ్గుతుంది. 1962 ఎన్నికల దాకా దేశమంతటా ఒకే సారి ఎన్నికలు జరిగాయి. ఆ తరవాతే అనివార్యంగా క్రమం తప్పింది. ఒకే సారి ఎన్నికలు జరపడానికి ఏ రాష్ట్రంలోనైనా సభ రద్దయితే మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ చేసిన సూచన పొంతన లేనిదే. లోక్‌సభ ఎన్నికలలోనూ ప్రజలు బీజేపీ బలాన్ని కుదించవచ్చునని మొన్ననే రుజువైందిగా! అయినా దురాశ ఎందుకో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img