Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఇండోనేసియాలో పేలిన అగ్నిపర్వతం

సునామీ హెచ్చరికలు జారీ
11 వేలమంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

జకర్తా: ఇండోనేసియాలో అగ్నిపర్వతం బద్ధలైంది సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్‌ రువాంగ్‌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. మంగళవారం రాత్రి నుంచి 24 గంటల వ్యవధిలోనే సుమారు 5 సార్లు విస్ఫోటనం చెందినట్లు ఆ దేశ భౌగోళిక సంస్థ తెలిపింది. దీంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నట్లు వెల్లడిరచింది. ఈ నేపథ్యంలో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేసినట్లు స్థానిక మీడియా వెల్లడిరచింది. లావా పెద్ద ఎత్తున సమీప ప్రాంతాలకు చేరుతుండటంతో అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. 725 మీటర్ల (2,378 అడుగులు) రువాంగ్‌ అగ్నిపర్వతం నుంచి సుమారు 6 కిలోమీటర్ల (3.7 మైళ్లు) మేర దూరంగా ఉండాల్సిందిగా స్థానికులను అధికారులు కోరారు. మరోవైపు విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలోకి కూలిపోయి సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానికులకు పలు సూచనలు చేశారు. వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని దాదాపు 11 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారందరినీ సులవేసి ద్వీపంలోని మనాడోకు సమీప నగరానికి పడవల ద్వారా పంపుతున్నారు. కాగా, ఇండోనేసియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్‌ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img