Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఉచిత విద్య కు దరఖాస్తు గడువు పెంపు..

మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:; ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 31 వరకు గడువు అవకాశమును కల్పించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) విద్యా హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైనా అనాధలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసి వర్గాల పిల్లలకు ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించబడునని తెలిపారు. వీరందరికీ విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూల్, ఆన్ ఎడిట్ స్కూల్లో 25 శాతం సీట్లు కేటాయించబడినవని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలోని సచివాలయం లేదా ఇంటర్నెట్, ఎంఈఓ కార్యాలయము, మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ నెంబర్ తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో విద్యార్థి పేరు, ఆధార్ నెంబర్ లేదా తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ తో ఇతర వివరాలు నమోదు చేయాలని, ఆన్లైన్లో కనిపించే పాఠశాలలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు అని తెలిపారు. ఆన్లైన్ లాటరీ ద్వారా స్కూలను కేటాయించడం జరుగుతుందన్నారు. వెబ్సైట్ వివరాలు:: http://cse.ap.gov.in/rte అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img