Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

గిరి అడవిలో ఓటేసిన ఏకైక ఓటరు

అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల మూడవ దశలో భాగంగా మంగళవారం పది రాష్ట్రాల్లో పోలింగ్‌ జరిగింది. ప్రతి ఓటు విలువైనదే అన్న క్రమంలో ప్రతి ఒక్క ఓటరును చేరుకునే ప్రయత్నాన్ని పోలింగ్‌ అధికారులు చేశారు. ఇదే క్రమంలో గుజ రాత్‌లోని గిరి అటవీ ప్రాంతంలోని బనేజ్‌లోని ఏకైక ఓటరు మహంత్‌ హరిదాస్‌ ఉదాసీన్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహంత్‌ హరిదాస్‌ ఉదాసీన్‌ … గిరి అడవిలోని పురాతన శివాలయానికి అర్చకుడు. దగ్గర్లో పారే కాలువ మొసళ్లు ఉంటాయి. ఏషియాటిక్‌ లైన్‌ ఈ అడవిలో ప్రత్యేక ఆకర్షణ. తనకు అడవి వాతా వరణం నచ్చిందని హరిదాస్‌ ఉదాసీన్‌ చెప్పారు. తన ఓటు కోసం ఈసీ అధికారులు చాలా కష్టపడ్డారని… ఇది ప్రజాస్వామ్య శక్తికి.. ప్రతి ఒక్క ఓటరు ప్రాముఖ్యతకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికల అధికారుల శ్రమను కొనియాడారు.
అయితే ఒక ఓటరు కోసమైనాగానీ 10 మంది సిబ్బందితో పోలింగ్‌ బూత్‌ నిర్వహించాలి. హరిదాస్‌ ఉదాసీన్‌ కోసం ఎన్నికల అధికారులు ఎత్తు పల్లాలతో సాగే అడవి మార్గాల్లో క్లిష్టమైన బస్సు ప్రయాణం చేసివెళ్లారు. కాషాయ వస్త్రధారణలో, నుదిటిన గ్రంథపు తిలకంతో ఉండే హరిదాస్‌ ఉదాసీన్‌ ఓటు వేసేందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క ఓటరున్నా… మైళ్ల వరకు మానవ జాడ లేకపోయినా పోలింగ్‌ రోజు సాయంత్రం వరకు బూత్‌ నిర్వహించాలన్నది ఎన్నికల సంఘం నిబంధన. అలాగే ప్రతి బూత్‌లో ఆరుగురు సిబ్బంది, ఇద్దరు పోలీసు అధికారులు తప్పనిసరిగా ఉండాలి. దీంతో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో మూడు గంటల బస్సు ప్రయాణం తర్వాత మారుమూల అటవీ శాఖ కార్యాలయానికి చేరుకొని పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేశారు. నేలపై నిద్రించారు. రొట్టె, పప్పుతో సాదాసీదా భోజనం చేశారు. ఉదయం 7 గంటలకల్లా పోలింగ్‌కు అంతా సిద్ధం చేశారు. సెల్‌ఫోన్‌ టవర్‌ కూడా లేకపోవడంతో అక్కడ ఎలాంటి తప్పు జరిగేందుకు ఆస్కారమే ఉండదు. మధ్యాహ్నం భోజనం సమయానికి బూత్‌కు చేరుకొని తన ఓటు హక్కును హరిదాస్‌ ఉదాసీన్‌ వినియోగించుకున్నారు. వేలికి సిరా చుక్కతో ఫోటో దిగారు. దీంతో ఈ బూత్‌లో 100శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ హరిదాస్‌ చిత్రాన్ని ఎన్నికల సంఘం పోస్టు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img