విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు 10 మంది రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్.ఎం. కె.రాము శనివారం మీడియాకు తెలియజేసారు. ఈ నెల 15 న ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఫెన్సింగ్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు తమ పాఠశాల ఆవరణలో నిర్వహించామన్నారు. తమ పాఠశాలకు విద్యార్థులు కర్నూలు లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులను అభినందించిన వారిలో వ్యాయామ ఉపాధ్యాయుడు గండి భాస్కర్, గంగునాయుడు, ఎస్.ఎం.సి. ఛైర్మన్ గణపతమ్మ, మాజీ సర్పంచ్ యేడువాక లక్ష్మణ్ కుమార్, ఎస్.ఎం.సి. మాజీ చైర్మన్ యేడువాక సత్యారావు తదితరులు వున్నారు.