విశాలాంధ్ర- ముత్తుకూరు : మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాడు నకిలీ మద్యం కేసులో ఉన్నప్పుడు అప్పటి మంత్రి నారాయణ ను నారాయణ సార్ అంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసి నేడు నారాయణ అని సంబోధించడం కాకాని గోవర్ధన్ రెడ్డికి తగదని, మంత్రి నారాయణ ను ఎలా సంబోధించాలో కూడా ఆయనకు తెలియకపోవడం విచారకరమని టిడిపి మండల కార్యదర్శి మల్లికార్జున యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిహెచ్డి చదివారని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని గౌరవంగా సంబోధించడంకూడా తెలియకపోవడం విచారకరమన్నారు. ఏడాదిలో కాకాని గోవర్ధన్ రెడ్డి నకిలీ మద్యం కేసులో ముద్దాయిగా ఉండడంతో ఆ కేసు నుండి బయటపడేందుకు అప్పటి మంత్రి నారాయణ చుట్టు ప్రదక్షిణ చేయడం కాకుండా, ఈ కేసు నుండి తనను బయట పడేయాల సారు అంటూ ఆయన చుట్టూ రాత్రి పగలు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రదక్షిణలు చేసిన సంగతి మరిచిపోయారని ఈ విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇతరుల పట్ల గౌరవాన్ని ఎలా ప్రదర్శించాలో కూడా తెలియకపోవడం విచారకరమని తెలిపారు. నారాయణ నారాయణ అని సంబోధించడం ఏమిటని ప్రశ్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కి గౌరవించడం తెలియదని అతని వద్ద నుండి గౌరవం పొందాలంటే ఎడారిలో మంచినీటిని వెతుక్కున్నట్టేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈపూరు మునురెడ్డి, అక్కయ్య గారు ఏడుకొండలు, బోలిగర్ల శీను, షఫీ ఉల్లా, శంకర్, సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.