Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గిరి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

రూ.80 లక్షలతో రెండు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని కొమ్మంగి పంచాయతీలో రూ.80 లక్షలతో రెండు జె ఎస్ బి రహదారుల నిర్మాణానికి వైకాపా అరకు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గురువారం శంకుస్థాపన చేశారు. కొమ్మంగి పంచాయతీ కిక్కిసలబంధ గ్రామం నుండి లుబ్బగుంట వరకు రూ. 40 లక్షలతోనూ కిక్కిసలబంధ గ్రామం నుండి జెర్రగెడ్డ వరకు మరో రూ.40 లక్షలతోనూ ఈ రెండు రహదారుల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులతో కలిసి భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలాలతో గ్రామాలను అనుసంధానం చేస్తూ అనేక గ్రామాలకు నూతనంగా రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఒకపక్క సంక్షేమానికి మరోపక్క అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ గడచిన నాలుగేళ్ల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైకాపా ప్రభుత్వం ముందడుగు వేసింది అన్నారు. పాడేరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ గ్రామాలను కలుపుతూ రహదారి నిర్మాణాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ వైకాపా ప్రభుత్వంలో పరిష్కారం చూపడం జరిగిందన్నారు. కమ్యూనికేస్ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రతి ఇంటికి తాగునీరందించడం, గ్రామాలను అనుసంధానం చేస్తూ రహదారి నిర్మాణం చేపట్టడాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకున్నట్లు అని చెప్పారు. వైకాపా ప్రభుత్వం రాజకీయ పార్టీలకతీతంగా ప్రజల పక్షాన పాలన సాగిస్తుందని, ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా సంక్షేమ పాలన అందిస్తూ విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చిందన్నారు. పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, బైజ్యూస్ తో ఒప్పందం చేసుకోవడం వంటివన్నీ గిరిజన బిడ్డలకు ఎంతోగానో ఉపయోగపడ్డాయన్నారు. పాఠశాలలలోనూ కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని, విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ జగనన్నకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాంగి లక్ష్మి , ఎంపీటీసీ జర్తా రూతు, ఎంపీపీ అనూష దేవి, జెడ్పీటీసీ బాలయ్య, వైస్ ఎంపీపీ గోపి నాయక్ శారద, జెసిఎస్ మండల కన్వీనర్ పాంగి గణబాబు, మండల అధ్యక్షులు మోరి రవి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, సర్పంచులు లోత పండయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మీరా, కోఆప్షన్ సభ్యులు షేక్ నాజర్ వలీ, ఎంపిటిసిలు చిందాడ జయలక్ష్మి, దాసరి ధారలక్ష్మి, వైకాపా నాయకులు బాలరాజు, కొర్ర రఘునాథ్, రాజేశ్వరరావు, AMC డైరెక్టర్ అప్పన్న ,సీనియర్ నాయకులు రసూల్ నాయుడు , పాండా ప్రసాద్, వెంకట రావు, లకే సత్యనారాయణ, చల్లంగి రవి, వార్డు మెంబర్ మరియమ్మ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img