Friday, May 3, 2024
Friday, May 3, 2024

వేములవలస ప్రజలు లో స్థానిక నాయకులు మీద తీవ్ర అసంతృప్తి

విశాలాంధ్ర- ఆనందపురం : స్థానిక వేములవలస లో గత కొన్ని రోజులుగా మొదటి ఇళ్ల స్థలాల లిస్టులో అక్రమంగా 98 మందికి అనర్హులుకి అర్హత కల్పించి స్థానికులకు నిజమైన అర్హులకు అన్యాయం చేశారు మరియు దీనికి ప్రభుత్వ అధికారులు కూడా సహాయం చేస్తున్నారు. దీని మీద ప్రజలందరూ చాలాసార్లు స్థానిక నాయకులుకు ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపైనే వాలంటరీలు కూడా స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారికి కలిసి చెప్పడం జరిగింది. అతను వెంటనే సమస్యను అర్థం చేసుకొని దాని సంబంధించిన చర్యను తీసుకోవాల్సిందిగా స్థానిక నాయకులను మరియు ఎమ్మార్వో గారికి చెప్పడం జరిగింది. కాని స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారి మాటను కూడా పక్కనపెట్టి వాళ్ళకి నచ్చిన విధంగా రెండవ ఇళ్ల స్థలాలు లిస్టు వాళ్లకి నచ్చిన వారికి ఇవ్వడానికి సన్న హాలు చేశారు. మరియు ప్రజల తరఫున ఉన్న వాలంటరీలని స్థానిక నాయకులు వాళ్లని ఉద్యోగం నుండి తీసేస్తామని మరియు బెదిరించి ఫోన్ కాల్ చేసి వేధిస్తూ, విధులను నిర్వహించకుండా అడ్డు పడుతున్నారు. దీని మీద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ప్రజాతీర్పు అనే మీటింగ్ పెట్టుకుని స్థానిక నాయకులు ఇంటికి వెళ్లి ప్రశ్నించడo జరిగింది. కాని స్థానిక నాయకులు వాళ్ళ యొక్క పనితీరు మాత్రం మార్చుకోలేదు. కావున స్థానిక ఎమ్మెల్యే మరియు పై అధికారులు కలుగజేసుకొని ఈ సమస్యకు పరిష్కారం ఇస్తారని వేములవలస గ్రామ ప్రజలు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img