Monday, June 5, 2023
Monday, June 5, 2023

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగారావు

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని బూర్జ,లక్ష్మీపురం గ్రామాలలో శనివారం జరిగిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజింగి జోగారావు పాల్గొని ఆయా గ్రామాలలో ప్రజలఇళ్లకు వెళ్లి వారిని నేరుగా కలుసుకొని వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేకూరిన లబ్ధి, పొందిన ప్రయోజనాలతోపాటు గతప్రభుత్వంలో మోసపోయిన, మోసగించిన విధానాన్ని విడమరిచి రెండు ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అన్నది చెప్పారు. అలానే ప్రజా మద్దతు పుస్తకంలో పొందుపరిచిన ఐదుప్రశ్నలను వారికి అడిగి అవును అనిసమాధానం చెప్పినట్లయితే వారికి రసీదులు అందించి వారి నుంచి మద్దతు స్వీకరిస్తూ వారి ఇంటి డోరుపై జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను మరియు ఫోన్ పై స్టిక్కర్ను అతికించి వారితో కలిసి ఫోటో దిగారు.
భవిష్యత్తులో జగన్ గారి పై నమ్మకం ఉంచి మళ్లీ ఆయన పాలనే కావాలని, రావాలని ప్రజలు విశ్వసించడంతో పాటుగా ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలందరూ మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలపాలన్నారు.
ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది ప్రతిపక్షాలు, పగటివేషగాళ్లు లేనిపోని కల్లబొల్లి మాటలు చెపుతారని, వాటిని పట్టించు కోకుండా ప్రజాసంక్షేమ పాలనను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచి మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఆయనను సీఎంగా గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, గ్రామసర్పంచ్ గుజ్జల దాసు, ఎంపీటీసీలు టీ సూరపు నాయుడు, టి పార్వతమ్మ, సీనియర్ నాయకులుఆర్వీ ప్రసాద్, తెంటు వెంకట అప్పలనాయుడు, బుడితి ముకుంద, మండలత్రినాథ, సచివాలయంల కన్వీనర్లు, గృహసారథలు, వైసిపి కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img