Monday, May 29, 2023
Monday, May 29, 2023

జిల్లా విద్యాశాఖాదికారి డాక్టర్ రమణ సస్పెన్షన్ ఎత్తివేయాలి

విశాలాంధ్ర,సీతానగరం: విద్యాశాఖాధికారి డాక్టర్ రమణను  విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సస్పెన్షన్ చేయడాన్ని పునః పరిశీలనచేసి తక్షణమే ఆయన సస్పెన్షన్ ఎత్తివేసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఏపీటిఎఫ్ మహిళా కౌన్సిలర్, కోట సీతారాంపురం ప్రాధమిక పాఠశాల హెచ్ ఎం కోట శ్రీదేవి విజ్ఞప్తి చేశారు.శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మంచి అధికారి, ఉన్నత విద్యావంతులు, నిరంతరం పాటశాలల అభివృధ్ధి, పిల్లల అభివృధ్ధి,ఉపాధ్యాయ సిబ్బంది బాగోగులు కోరుకునే డిఈఓ రమణ సస్పెన్షన్ అందరిలో అవేదనకు గురి చేసిందన్నారు. ఆయనపై తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అతనితో పాటు సస్పెండ్ చేసిన మిగిలిన ఆరుగురు ఉద్యోగుల సస్పెన్షన్ ఎత్తివేసే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img