Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఎన్నికలలో సూక్ష్మ పరిశీలకులు కీలకం

జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు
విశాలాంధ్ర,పార్వతీపురం : శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే విధంగా మైక్రో అబ్జర్వర్లు( సూక్ష్మ పరిశీలకులు) కీలకంగా విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు తుది విడత శిక్షణాతరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల ప్రక్రియ సక్రమంగాజరిగేలా నిశితంగా పరిశీలించాలన్నారు. పట్టభద్రులు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకొనేలా మహిళలు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల డైరీలోని నిబంధనలు పాటించాలని, చెక్ లిస్టు ప్రకారం సరిచూసుకోవాలని తెలిపారు.పోలింగుకేంద్రాల వద్ద ఏమైనాఇబ్బందులు తలెత్తితే ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. 13న పోలింగుకు ముందు పారదర్శకతకు ఖాళీ బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్ సమక్షంలో చూపించి పోలింగ్ ప్రారంభించాలన్నారు. ఓటుహక్కు వినియోగించుకునే పట్టభద్రులకు 12రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కమిషన్ అనుమతించిందని, గుర్తింపుకార్డు తప్పనిసరని స్పష్టం చేశారు.అనంతరం ఎన్నికలప్రక్రియ ముగిసేవరకు పగడ్బందిగా నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణను అందించారు. మైక్రో అబ్జెర్వర్లకున్న అనుమానాలను నివృత్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img