Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా

  • ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కొట్యాడ లోకాభి రామకోటి
  • అట్టహాసంగా కొట్యాడ లోకాభి రామకోటి నామినేషన్ దాఖలు
    విశాలాంధ్ర-శృంగవరపుకోట : అన్ని విధాల వెనుకబడిన విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కొట్యాడ లోకాభి రామకోటి అన్నారు. ఎస్.కోట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం శృంగవరపుకోట ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎస్.కోట ఆర్కే గ్రాండ్ ఫంక్షన్ హాల్ నుంచి దేవి జంక్షన్ వరకు వందలాది మంది ప్రజలు, కాంగో డప్పు వాయిద్యాల నడుమ ర్యాలీగా వచ్చి దేవి ఆలయంలో కొట్యాడ లోకాభి రామకోటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన న్యాయవాదులు, ప్రతిపాదకుడుతో వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.మురళీకృష్ణకు రామకోటి నామినేషన్ పత్రాలను అందజేసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలాల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీనిచ్చేందుకు గ్రామాల్లో తిరుగుతూ తన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సమాజంలో ఉన్న కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూశానని, పేదల కష్టాల విలువ తెలుసు కాబట్టే వారి అభివృద్ధి కోసం పాటుపడతా అని ప్రకటించారు. అభివృద్ధిలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని నెంబర్ వన్ చేస్తాననే నినాదంతో ముందుకు సాగుతానని తెలిపారు. నాలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావాలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గెలిచిన పార్టీకి మద్దతు ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి సాధ్యమైనన్ని నిధులు తీసుకొస్తానని కొట్యాడ లోకాభి రామకోటి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img