Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కోండ్రు నామినేషన్

ఎండను లెక్కచేయకుండా వేల సంఖ్యలో పాల్గొన్న ప్రజలు

విజయనగరం జిల్లా. రాజాం : విజయనగరం జిల్లా రాజాం లో మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ శుక్రవారం నాడు రాజాం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి నామినేషన్ పత్రాలను శుక్రవారం నాడు దాఖలు చేశారు. ముందుగా కోండ్రు మురళీమోహన్ రాజాం పట్టణంలో గల శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేమకోట సూర్యనారాయణ శర్మ అమ్మమ్మ తీర్థ ప్రసాదములు, అమ్మవారి ఆశీర్వాదాలు అందించారు.నామినేషన్ పత్రాలపై ముహూర్త సమయానికి సంతకాలు చేసారు. అనంతరం అమ్మవారి గుడి నుంచి తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు, జనసేన నాయకులు,జనసైనికులు,జనసేనా నాయకులు, బిజెపీ నాయకులు, కార్యకర్తలు మహిళలు అభిమానులతో భారీ ర్యాలీ తో వెళ్ళారు. ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.వేలసంఖ్యలో
బొబ్బిలి జంక్షన్ మీదుగా ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నాలుగు సెట్లతో కూడిన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.మండుతున్న ఎండను సైతం లెక్క వేయకుండా మహిళలు వృద్ధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఎక్కడికక్కడ పార్టీ నాయకులు షామియానాలు వేయించారు. దారి పొడువుగా మజ్జిగ మంచినీరు అందించారు. బొబ్బిలి రోడ్డు,పాలకొండ రోడ్డు, శ్రీకాకుళం రహదారులన్నీ జనసందోహంగా మారాయి. ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారు.
అనంతరం కోండ్రు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసలు పడి మండుటెండను సైతం లెక్కచేయకుండా నామినేషన్ పర్వాన్ని జయప్రదం చేసిన ప్రతీ ఒక్కరికీ ఋణపడి ఉంటానన్నారు.ఇంతే స్ఫూర్తితో ఎన్నికల్లో అఖండ మైన మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.ఈ ఎన్నికల్లో సీఎం జగన్ ను ప్రజలు ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధం గా ఉండాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img