Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

పెదబోగిలిలో రెండురోజులపాటు శిక్షణ కార్యక్రమాలు: డిపిఓ సత్యనారాయణ

విశాలాంధ్ర, సీతానగరం:  మన్యం జిల్లాలోని పార్వతీపురం నియోజక వర్గంలోని గ్రీన్ అంబాసిడర్లకు, పంచాయతీసర్పంచులకు,కార్యదర్శులకు,ఇంజినీరింగ్, వ్యవసాయశాఖ సహాయకులకు ఈనెల 28, 29తేదీల్లో రెండు రోజులపాటు బ్యాచులవారీగా పెద బోగిలి చెత్త సంపద కేంద్రం వద్ద శిక్షణ ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు.సోమవారం ఆయన మండలంలోని లచ్చయ్యపేట గ్రామ పంచాయతీనీ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆయన మాట్లాడుతూ చెత్తను తరలించడం చేస్తున్న హరిత రాయబారు లకు పంచాయతీల నుండి15వ ఆర్థిక సంఘం నుండి డబ్బులు చెల్లించాలని కోరారు. పూర్తిగా ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.
శ్రీఇంటి పన్నులు రూ.4కోట్ల 86లక్షల డిమాండులో ఇంతవరకు రూ. కోట్ల 2లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు.గురువారం మండల కేంద్రంలోని పెదబోగిలి మేజర్ పంచాయతీలోనీ చెత్తసంపద కేంద్రం నిర్వహణ, వానపాముల పెరుగుదల, వ్యర్థ పదార్థాలతోను,చెత్తతో తయారు చేస్తున్న సేంద్రియఎరువులుపట్ల, వర్మీ ఉత్పత్తిని గమనించి అన్ని గ్రామాలలో ఇదేవిధంగా చెత్త సంపద కేంద్రంలను తీర్చిదిద్దాలని కోరారు.స్వమిత్వ సర్వేలో భాగంగా గ్రామాలలో ఉండే వ్యవసాయ భూములను సర్వే చేస్తున్న రెవెన్యూ, సర్వే అధికారులు గ్రామకంఠంలోఉండే నిర్మాణాలు, ఖాలీ స్థలాలును సర్వే చేయించడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈసర్వే పూర్తయ్యాక గ్రామ కంఠంలో ఉండే వాటికి ప్రాపర్టీ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.గ్రామాల్లో బోర్లువద్ద, బావులు వద్ద, రక్షిత మంచినీటి పథకాల వద్ద క్లోరినేషన్ చేయించాలని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img