Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పురోభివృద్ధిలో పులకరిస్తున్న పల్లెలు

కొయ్యలగూడెం: వైసిపి ప్రభుత్వ పాలనలో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శనివారం పొంగుటూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ పసుపులేటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఎంపీపీ గంజి మాల రామారావు, జడ్పిటిసి దాసరి శ్రీలక్ష్మి లతో కలిసి ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. దేశంలోనే జిడిపి అభివృద్ధి సాధించిన రాష్ట్రాలలో మణిపూర్, తమిళనాడు, రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్ నిలబడడం మనకు గర్వకారణం అన్నారు. రాబోయే ఎన్నికలలో 175 స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాల వారికి ఒత్తిడి తగ్గించేలా సచివాలయ వ్యవస్థను రూపుదిద్దడంతో ఉద్యోగ సంఘాల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. నాడు నేడు, విద్యా దీవెన, అమ్మబడి తదితర పథకాల ద్వారా విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసిన జగన్ వైద్య వ్యవస్థను మరింత పటిష్టం చేసి అట్టడుగు వర్గాల వారికి ఉన్నత వైద్యాన్ని అందించే విధంగా కృషి చేస్తున్నారన్నారు. విద్యా, వైద్య విధానాలు రెండు కళ్లుగా భావిస్తూ ఆ రంగాల సేవలను అణగారిన ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంగన్ వాడి కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను అందజేశారు. వైసిపి మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ కొల్లూరు సత్తిబాబు, పశ్చిమ డెల్టా బోర్డు చైర్ పర్సన్ గంజి మాల దేవి, మాజీ ఎంపీపీ మట్ట సత్తిపండు, వైసిపి నాయకులు గేలం వెంకటేశ్వరరావు, కైకవరపు గోపి, గేలం శ్రీను, చటారి బాబురావు, తోట శ్రీను, జొన్నకూటి కృష్ణ, రాజనాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img