Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

దేవాలయాలలో ధర్మ పాలన చేస్తున్నాం..

ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ…

విశాలాంధ్ర -భీమవరం: సనాతన ధర్మం కాపాడాలని, ధర్మం నిలబడాలని, అన్ని దేవాలయాలలో ధర్మ పరిపాలన చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.గురువారం భీమవరం త్యాగరాజ భవనం నుంచి పట్టు వస్త్రాలు, వివిధ రకాల స్వీట్స్, పండ్లు, పువ్వులుతో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వరకు అషాడమాస సారెను ఉప ముఖ్య మంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసన సభ్యులు గ్రంథి శ్రీనివాస్ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అలయ ప్రధనార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ అధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అషాడమాస సారెను ఉప ముఖ్య మంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, శాసన సభ్యులు గ్రంథి శ్రీనివాస్ అందజేశారు. ఊరేగింపు కంటే ముందుగా కోలాట నృత్యాలు, కేరళ డప్పు వాయిద్యాలు,, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అతి వైభవంగా నిర్వహించారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులకు, స్థానిక శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ లకు వేద పండితులు ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేయడం జరిగింది.అనంతరం ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు సంతృప్తి పాలన అందిస్తున్నామని, రాష్ట్రానికి అమ్మవారి కరుణ కటాక్షాలు మెండుగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండి, రైతులు ఆనందంగా ఉండాలని కోరామన్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా అషాడమాస సారె సమర్పిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ వార్ల దేవాలయాల్లో ఆషాడ సారె కార్యక్రమాలు జరపాలని ముఖ్యమంత్రి
జగన్ ఆదేశించారన్నారు. ఒకప్పుడు రాజులు, మహారాజులు ఇటువంటి కార్యక్రమాలు చేసేవారని, ఇప్పుడు మన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి దైవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఉప ముఖ్య మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్ జెసి ఇ.సురేష్ బాబు, డిప్యూటీ కమిషనరు విజయ రాజు, ఆర్ డివో దాసి రాజు, ట్రైనీ డిప్యూటీ కలెక్టరు కుమారి డిఅఖిల, మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో యర్రంశెట్టి భద్రాజీ, చైర్మన్ మానేపల్లి నాగన్నబాబు, నగరంలోని వివిధ దేవస్థానాల ఈవోలు దండు వెంకట కృష్ణంరాజు, రుద్రరాజు గంగాశ్రీదేవి, తోట శ్రీనివాస్, గొట్టుముక్కల సీతారామరాజు, రుద్రరాజు ఫణి కిషోర్, సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కోడే విజయలక్ష్మి, పాలకవర్గ సభ్యులు మావూరి సుందరరావు, ముత్యాల రావు, చెల్లంకి గిరి, భాగ్యలక్ష్మి, రామాయణం సత్యనారయణ, కోడే యుగంధర్, ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు, మంతెన రామ్ కుమార్ రాజు, తోట బోగయ్య, భక్తులు , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img