Friday, May 3, 2024
Friday, May 3, 2024

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి…

విశాలాంధ్ర పాలకోడేరు: గర్భం దాల్చిన ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సాధారణ సుఖప్రసవాలు జరిగి తల్లికి, బిడ్డకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ స్వర్ణ నిరంజని అన్నారు. సోమవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమములో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వివిధ గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను పరీక్షించి వారికి తగిన సలహాలు సూచనలుఇచ్చారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈ పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా చేస్తారని, సంబంధించిన వివరాలు ఆయా గ్రామాల్లో గల ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, అంగనవాడి ల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా ప్రసవ సమయం దగ్గర పడుతున్నప్పుడు ఎక్కువగా శాకాహారాన్ని భుజించాలని, వాటితో పాటు తినే ఆహారంలో ఆకుకూరలు, పండ్లుఉండే విధంగాచూసుకోవాలన్నారు, అంతేకాకుండా శరీరానికి తగినంత వ్యాయామం, విశ్రాంతిఅవసరం అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది గర్భిణీ స్త్రీలలో రక్తహీనత కనిపిస్తుందని దానికనుగుణంగా ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలన్నారు. ఏ సమయంలోనైనా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే దగ్గరలో ఉన్న ఏఎన్ఎం ని, ఆశవాలంటీర్ కు తెలియజేసి తగిన వైద్య సహాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన సుమారు 100మంది గర్భిణీ స్త్రీలను పరీక్షించి అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సత్యనారాయణ,వివిధ గ్రామాలకు చెందిన ఏఎన్ఎం లు, ఆశావాలంటర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img