Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

యూపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘ప్రతిజ్ఞా యాత్ర’

ప్రారంభించిన ప్రియాంక గాంధీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే వివిధ వర్గాలను ఆకర్షిస్తూ అనేక హామీలు గుప్పించిన ఆ పార్టీ వాటిని విస్తృతంగా ప్రచారం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతిజ్ఞా యాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం బారాబంకి నుంచి ప్రారంభించారు. మూడు ప్రధాన మార్గాల్లో దాదాపు 12 వేల కిలోమీటర్ల పొడవున నవంబరు ఒకటి వరకూ సాగే ఈ యాత్రలో పార్టీ ఆమోదించిన వివిధ తీర్మానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు, ఇంటర్‌ పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్‌లు, డిగ్రీ పూర్తి చేసిన బాలికలకు ఈ-స్కూటీలు ఇస్తామని ప్రకటించిన ప్రియాంకగాంధీ…ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రధాన హామీలతో వ్యవసాయ రుణ మాఫీ, ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం, సగం ధరకే విద్యుత్‌ సరఫరా, కోవిడ్‌ కాలానికి సంబంధించిన పెండిరగ్‌ విద్యుత్‌ బిల్లులు రద్దు చేస్తామని ప్రియాంక గాంధీ యాత్ర ప్రారంభోత్సవంలో ప్రకటించారు. బారాబంకి నుంచి బుందేల్‌ఖండ్‌ వరకూ సాగే యాత్రకు కాంగ్రెస్‌ పార్టీ నేత పీఎల్‌ పునియా నాయకత్వం వహించనుండగా, సహరాన్‌పూర్‌ నుంచి మధుర వరకూ సాగే యాత్రకు ప్రదీప్‌ జైన్‌ ఆదిత్య, వారణాసి నుంచి రాయ్‌ బరేలీ వరకు సాగే యాత్రకు మాజీ ఎంపీ ప్రమోద్‌ తివారీ నాయకత్వం వహించనున్నారు. పార్టీ చేపట్టిన యాత్రలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను, ప్రధానమైన ఏడు హామీలను వివరిస్తూ రోడ్డు షోలు, పత్రికా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img