Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

డోలీలోనే ప్రసవం

రహదారి సౌకర్యం లేక గిరిజనుల అగచాట్లు..
తల్లీబిడ్డను 108 వాహనం వద్దకు తీసుకెళ్లి ఆసుపత్రికి తరలింపు
విజయనగరం జిల్లాలో ఘటన

విశాలాంధ్ర ` మెంటాడ : రహదారి సౌకర్యాలు లేక గిరిజన గ్రామాల ప్రజలు వైద్య సేవలు పొందేందుకు నానాఅగచాట్లు పడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇక గర్భిణుల బాధలు వర్ణనాతీతం. తాజాగా డోలీలో తీసుకువెళుతున్న గర్భిణి మార్గంమధ్యలోనే ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. మెంటాడ మండలం ఆగూరు పంచాయతీకి చెందిన మధుర గిరిజన గ్రామం మల్లేడువలసకు చెందిన గర్భిణి నంజాన కాసులమ్మకు బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో మెంటాడ పీహెచ్‌సీకి తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గత మూడురోజులుగా కురిసిన వర్షాలకు చంపావతి నది పరవళ్లు తొక్కుతోంది. నది దాటాలంటే ప్రాణాలను వదులుకోవాల్సిందే. గత్యంతరంలేని పరిస్థితిలో మంచాన్ని డోలీగా కట్టి అందులో కాసులమ్మను బొండపల్లి మండలం గొల్లుపాలెంకు కొండల నడుమ కాలినడకన తీసుకుని వెళుతుండగా మార్గంమధ్యలో ఆమెకు ప్రసవం అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే 108 వాహనానికి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ తల్లీబిడ్డను గొల్లుపాలెం వద్ద ఉన్న 108 వాహనం వద్దకు తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అయితే 108 వైద్య సిబ్బంది తల్లీబిడ్డను పరీక్షించి, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడిరచారు. అనంతరం తల్లీబిడ్డకు మెరుగైన వైద్యం కోసం అదే వాహనంలో గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img