Friday, April 26, 2024
Friday, April 26, 2024

సాగర్‌ జలాల పంపిణీలో తేడాలు సవరించండి

కుడి, ఎడమ కాలువల సామర్థ్యాలపై కేఆర్‌ఎంబీకి తెలంగాణా ఫిర్యాదు

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై తెలంగాణా ప్రభుత్వం ఇంకా తన ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తూనే ఉంది.
ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు చాలాకాలం క్రితం నిర్మించిన నీటి ప్రాజెక్టులపై కూడా ఫిర్యాదులు చేసిన తెలంగాణా జల వనరుల శాఖ, తాజాగా సాగర్‌ కుడి, ఎడమ కాలువల నీటి పంపకాలపై సైతం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి మరో ఫిర్యాదు చేసింది. నాగార్జునసాగర్‌ కాలువల సామర్థ్యంలో అసమతుల్యతను సవరించాలని కోరుతూ తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ బుధవారం ఈ మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. 1952లో ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాల ఒప్పందం ప్రకారమే కృష్ణా జలాల పంపిణీ కొనసాగాలని కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యాలు సమానంగా ఉండాలని పేర్కొన్నారు.
రెండు కాలువల సామర్థ్యంలో తీవ్రమైన అసమానత ఉందని తెలిపారు. 510 అడుగుల వద్ద ఎడమ కాలువ సామర్థ్యం 7,899 క్యూసెక్కులుండగా, కుడి కాలువ సామర్థ్యం 24,606 క్యూసెక్కులుగా ఉందన్నారు. దీనిని సరిచేసి ఇకపై రెండు కాలువల సామర్థ్యం సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీటి విడుదల సామర్థ్యాల్లో కూడా తేడాలను సరిదిద్దాలని కోరారు. ఏపీలో కుడి కాలువ ఆయకట్టుకు వేరే మార్గాలున్నాయని లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img