Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మిజోరాంలోకి మైన్మార్‌ శరణార్థులు

మైన్మార్‌: మైన్మార్‌ నుంచి మిజోరాంకు శరణార్థులు ప్రవేశిస్తున్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, నదులను దాటుతూ భారత్‌` మైన్మార్‌సరిహద్దుల్లో ఉన్న చిన్‌రాష్ట్రంలోని గ్రామాలపై గత కొంతకాలంగా సైనిక చర్యలతో విసుగెత్తిన ప్రజలు ఊర్లను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటివరకు 12,121 మంది శరణార్ధులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆశ్రయం కోసంవెళుతున్నారు. తంత్లాంగ్‌ పట్టణ సరిహద్దు గ్రామాల్లోసైనిక విమానాల దాడుల తరువాత మైన్మార్‌ శరణార్థులు మిజోరంలోకి ప్రవేశిం చారని ఉన్నతాధికారులు వెల్లడిరచారు. ఒక్క నప్‌ాథియాల్‌ జిల్లాలోనే చిన్‌ రాష్ట్రానికి చెందిన రెండు వేల మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. మిజోరాంలోని చంపాయ్‌, సియాహా, లవగ్లాయ్‌, సెర్చిప్‌, నప్‌ాథియాల్‌, సైతుయాల్‌ జిల్లాలు మయన్మార్‌తో సుమారు 510 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. హ్నాథియాల్‌జిల్లాలో 2000 మందికిపైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. హ్నాథియల్‌జిల్లాతోపాటు మైన్మార్‌శరణార్థులు లాంగ్‌ట్లాయ్‌, సియాహా, చంఫాయ్‌, లుంగ్లీ, సెర్చిప్‌జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img