Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల..

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోన విడుదలైంది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చామన్నారు సీఎం జగన్. ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి పథకాన్ని అమలు చేశామన్నారు. తాను సాధ్యమయ్యే హామీలు ఇచ్చి హీరోలా జనాల్లోకి వెళుతున్నానన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా.. ఆదాయం లేకపోయినా ఎలాంటి సాకులు చూపలేదన్నారు. మేనిఫెస్టో అమలుకు ఎన్ని సమస్యలు వచ్చినా.. చిరు నవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామన్నారు.
డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలను పొందుపరిచారు. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైఎస్సార్‌సీపీ. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం. ఈసారి పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గ‌తంలో కంటే ప్రతి విష‌యంలోనూ అధిక ల‌బ్ధి క‌లిగించేలా మేనిఫెస్టో ఉంటుందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా నవరత్నాల ప్లస్ పేరుతో ప్రజల ముందుకు తెచ్చే 2024 మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు యువత, మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని టాక్. మరీ ముఖ్యంగా పెన్షన్, అమ్మఒడి, రైతు భరోసా, చేదోడు లాంటి హామీలను కొనసాగిస్తూనే వాటిని పెంచే యోచన చేస్తోంది వైసీపీ. 2019లో ఇచ్చిన హామీలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ పైన సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. యువత కోసం ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రస్తావించినట్లు సమాచారం. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతితో పాటు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఉపాధి కల్పించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో యువత.. పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని భావించిన సీఎం జగన్.. ఉపాధి మార్గాలపై దృష్టి సారించేలా వారికోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేశామని చెబుతోన్న వైఎస్సార్‌సీపీ.. ఈసారి ఎలాంటి పథకాలను ప్రకటిస్తుందనే ఉత్కంఠ మొదలైంది. అటు ప్రజల్లో, ఇటు రాజకీయ శ్రేణుల్లో ఈ ఎన్నికల మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది. అయితే అలవికాని హామీలు, ఆచరణ సాధ్యం కానివి మేనిఫెస్టోలో ఉండవని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. పెద్దగా సంచలనాలకు అవకాశం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img