Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఇజ్రాయిల్‌ జైళ్లలో 20ఏళ్లుగా పలస్తీనియన్లు

రమల్లా : వందలాదిమంది పలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ జైళ్లలో 20ఏళ్లకుపైగా మగ్గుతున్నట్లు పలస్తీనా సెంటర్‌ ఫర్‌ ప్రిజనర్‌ స్టడీస్‌ (సీపీపీఎస్‌) ఒక ప్రకటనలో వెల్లడిరచింది. బహా యూసుఫ్‌ మసర్వె ఇజ్రాయిల్‌ జైల్లో 35ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇక్కడి జైళ్లలో మూడు దశాబ్దాలుగా శిక్ష అనుభవిస్తున్నవారు 13 మంది ఉన్నారు. వీరిలో 1938 నుండి జైలులో ఉన్న కరీం యూనిస్‌, మహర్‌యూనిస్‌పాటు 36 మంది, 25సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నావారు ఉన్నారు. వీరందరూ మానవ హక్కుల దుర్వినియోగం, ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు 4650 మంది పలస్తీనియన్లు ఇజ్రాయిల్‌లోని 23 జైళ్లలో ఉన్నారు. వీరిలో 200 మంది మైనర్లు కాగా 40 మంది మహిళలున్నారు. 1967 లో వెస్ట్‌ బ్యాంక్‌, గాజా స్ట్రిప్‌ ఆక్రమణ ప్రారంభమైనప్పటి నుండి, ఇజ్రాయెల్‌ జైళ్లలో కనీసం 226 మంది పాలస్తీనియన్లు మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img